: విద్రోహుల గుండెల్లో నిద్రపోండి: పోలీసులకు చంద్రబాబు ఉద్బోధ


సంఘ విద్రోహుల గుండెల్లో పోలీసులు నిద్రపోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత శిక్షణ పూర్తి చేసుకున్న తొలి బ్యాచ్ ఎస్సైల పాసింగ్ ఔట్ పరేడ్ ఈ రోజు అనంతపురంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, విధి నిర్వహణలో పోలీసులు ధైర్య సాహసాలతో ముందుకు సాగాలని, సంఘ విద్రోహుల గుండెల్లో నిద్రపోవాలని చెప్పారు. నిజాయతీతో వ్యవహరించాలని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం, హంద్రీనీవా రెండో దశ పనులను పర్యవేక్షించేందుకు బయలుదేరి వెళ్లారు.

  • Loading...

More Telugu News