: తడి చెత్త, పొడి చెత్త గురించి కాదు... రాజకీయ చెత్తపై మాట్లాడండి: కేసీఆర్ పై రావుల ధ్వజం
ఎన్నికలు వచ్చినప్పుడల్లా పథకాల పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ త్రీడీ సినిమా చూపిస్తారని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. పొడి చెత్త, తడి చెత్త గురించి మాట్లాడుతున్న కేసీఆర్... తన పార్టీలో చేర్చుకున్న రాజకీయ చెత్త గురించి మాట్లాడాలని అన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో ఖర్చు చేయడానికి టీఆర్ఎస్ ఇప్పటికే కోట్ల రూపాయలను తరలించిందని ఆరోపించారు. రైతులకు పెరుగన్నం పెడతామని గతంలో ఆర్భాటంగా చెప్పిన కేసీఆర్... ఇప్పుడు జైలు కూడు తినిపిస్తున్నారని విమర్శించారు.