: డబ్బు లేదు, ఖర్చు తగ్గించుకోండి: ఏపీ అధికారులతో యనమల


ఆంధ్రప్రదేశ్ ఖజానాలో వేతనాలకు, సంక్షేమ పథకాల అమలుకు తగినన్ని నిధులు లేవని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, 2015-16 సంవత్సరంలో రూ. 7 వేల కోట్ల ఆదాయ లోటు ఉందని వెల్లడించిన ఆయన, అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు. ఈ మేరకు అన్ని శాఖల కార్యదర్శులకు లేఖలు రాయనున్నామని తెలిపారు. బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే, ఇప్పటికే రూ. 10 వేల కోట్లను అదనంగా ఖర్చు పెట్టేశామని ఆయన గుర్తు చేశారు. లెవీ విధానాన్ని తొలగించడంతో ఏపీకి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిందని, పరిస్థితిని సమీక్షించి, ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా లోటును పూడ్చుకోవాలని యనమల సూచించారు.

  • Loading...

More Telugu News