: షారూఖ్ చెప్పాడని వాడితే, అందం పెరగలేదంటూ కోర్టుకెక్కిన యువకుడు... ఇమామీకి రూ. 15 లక్షల జరిమానా!


తన అభిమాన నటుడు షారూఖ్ ఖాన్ నటించిన ఓ వ్యాపార ప్రకటన చూసి, తాను ఇమామీ ఫెయిర్ అండ్ హ్యాండ్ సమ్ క్రీమును వాడానని, అయితే, ఆ ప్రకటనలో షారూఖ్ చెప్పినట్టుగా ఎటువంటి ఫలితాలూ రాలేదని ఆరోపిస్తూ నిఖిల్ జైన్ (23) కోర్టులో పిటిషన్ వేశాడు. దీన్ని మూడు వారాలు వాడితే, ముఖం రంగు వికసిస్తుందని ప్రకటనలో హామీ ఇవ్వగా, తాను షారూఖ్ పై నమ్మకంతో 2012 అక్టోబర్ 8న దీన్ని కొనుగోలు చేశానని, నెలరోజులు వాడినా ఫలితం రాలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. తన న్యాయవాదితో కలసి నిఖిల్ వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశాడు. కేసు విచారణ మూడేళ్ల పాటు సాగగా, ఇమామీకి రూ. 15 లక్షల జరిమానా విధించిన కోర్టు, ఆ వ్యాపార ప్రకటనను తక్షణం తొలగించాలని ఆదేశించింది. "అందం పేరిట ఉపయోగపడని ప్రొడక్టులను కొని ఇతరులు నష్టపోకూడదనే ఈ పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నా" అంటున్నాడు నిఖిల్.

  • Loading...

More Telugu News