: రేవ్ పార్టీ మత్తులో ఫారిన్ స్టూడెంట్స్...అరెస్ట్ చేసేందుకు వెళ్లిన మహిళా కానిస్టేబుల్ పై దాడి


ఐటీ కేపిటల్ బెంగళూరును రేవ్ పార్టీల విష సంస్కృతి ఇంకా వీడలేదు. గుట్టుచప్పుడు కాకుండా ఆ నగరంలో ఇప్పటికీ పెద్ద ఎత్తున రేవ్ పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా ఈ పార్టీల్లో మన దేశానికి చెందిన యువతే ఎంజాయ్ చేయగా, కొత్తగా విదేశాల నుంచి విద్యాభ్యాసం కోసం వస్తున్న విద్యార్థులు కూడా పాలుపంచుకుంటున్నారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని మరతహళ్లి ప్రాంతంలో గుట్టుగా సాగుతున్న ఓ రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో అక్కడ దాదాపు 350 మందికి పైగా యువత ఎంజాయ్ చేస్తున్నారు. పోలీసులను చూసి పలువురు యువకులు పరుగులు పెట్టారు. అయితే రేవ్ పార్టీ మత్తు తలకెక్కిన విదేశీ విద్యార్థులు తమను అరెస్ట్ చేసేందుకు యత్నించిన ఓ మహిళా కానిస్టేబుల్ పై దాడికి దిగారు. దీంతో మరిన్ని బలగాలను రప్పించిన పోలీసులు 22 మంది విదేశీ విద్యార్థులు సహా 39 మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా పట్టుబడ్డ విదేశీ విద్యార్థుల వీసా గడువు కూడా ముగిసిందని తేలింది.

  • Loading...

More Telugu News