: ఇండిగోకు ఎంత డిమాండో... లిస్టింగ్ రోజే ఆకాశానికి ఈక్విటీ!
ఐపీఓకు వచ్చి విజయవంతంగా నిధులను సమీకరించిన ఇండిగో, ఆపై స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన తొలి రోజున సత్తా చాటింది. ఇండిగో ఈక్విటీ ఇష్యూ ధర రూ. 765 కాగా, మార్కెట్ ప్రారంభమైన కాసేపటికే ధర రూ. 856కు చేరింది. ఇష్యూ ప్రైస్ పై ఇది 12 శాతం అధికం. ఆపై నిమిషాల వ్యవధిలో రూ. 883కు చేరుకుని మధ్యాహ్నం 12:50 గంటల సమయంలో రూ. 876 వద్ద ట్రేడవుతోంది. ఐపీఓ ద్వారా ఇండిగో మొత్తం రూ. 3,009 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే. 3 కోట్ల వాటాలను ఆఫర్ లో ఉంచగా, 18.5 కోట్ల బిడ్లు వచ్చాయి. కాగా, ఇండిగోపై ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని, స్వల్ప కాలిక పెట్టుబడిదారులు లాభాలను స్వీకరిస్తేనే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. తిరిగి ఈక్విటీ ధర తగ్గినప్పుడు కొనుగోలు చేయడం మేలని సూచిస్తున్నారు.