: కాపు నేత ముద్రగడతో వైకాపా మంతనాలు


కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే నినాదంతో ఉద్యమానికి ఊపిరి ఊదిన నేత ముద్రగడ పద్మనాభం. కాపు కులస్తుల్లో ఆయనకు ఉన్న ఇమేజ్ ప్రత్యేకమైనది. అలాంటి ముద్రగడతో వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు భేటీ అయ్యారు. ఈ నెలాఖరులో తూర్పుగోదావరి జిల్లాలో వైకాపా అధినేత జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ముద్రగడను పార్టీలోకి తెచ్చేందుకు అంబటి చర్చిస్తున్నట్టు చెబుతున్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేకులను ఏకతాటిపైకి తెచ్చే కార్యక్రమంపై వైకాపా దృష్టి సారించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News