: తండ్రితో కలిసి బైక్ పై వెళుతున్న యువతి మెడలో గొలుసు లాగేసిన స్నాచర్లు


హైదరాబాదులో చైన్ స్నాచర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కనిపిస్తే కాల్చివేస్తామని పోలీసులు ప్రకటించినా, చైన్ స్నాచర్లు స్వైర విహారం చేస్తూనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం బేగంపేట పరిధిలోని కంచన్ బాగ్ లో బైకుపై దూసుకువచ్చిన ఇద్దరు చైన్ స్నాచర్లు తమదైన రీతిలో చేతివాటం ప్రదర్శించారు తండ్రితో కలిసి బైక్ పై వెళుతున్న ఓ యువతి మెడలోని మూడు తులాల బంగారు గొలుసును అపహరించిన దొంగలు రెప్పపాటులో మాయమైపోయారు. ఈ ఘటనలో అదుపు తప్పి బైక్ పై నుంచి కింద పడ్డ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. చైన్ స్నాచర్ల మెరుపు దాడితో షాక్ తిన్న యువతి తండ్రి గాయాలపాలైన తన కూతురును సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు చైన్ స్నాచర్ల కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News