: ఎమ్మెస్కేకు చంద్రబాబు అభినందనలు...విశాఖ స్టేడియానికి ‘టెస్టు’ హోదాపై హర్షం


టీమిండియా సెలెక్షన్ కమిటీలో చోటు దక్కిన మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ కు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు. కమిటీ నుంచి రోజర్ బిన్నీ, రాజేందర్ సింగ్ లను తొలగించిన బీసీసీఐ ఎమ్మెస్కేతో పాటు గగన్ ఖోడాలను నియమించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే రాయలసీమ పర్యటనలో ఉన్న చంద్రబాబు స్పందించారు. ఎమ్మెస్కేకు టీమిండియా సెలెక్షన్ కమిటీలో చోటు దక్కడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. సెలెక్షన్ బోర్డులో చోటు దక్కించుకున్న తొలి తెలుగు వాడిగా రికార్డులకెక్కిన ఎమ్మెస్కే యువ క్రీడాకారులందరికీ ఆదర్శప్రాయుడని చంద్రబాబు కీర్తించారు. ఇక విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియానికి టెస్టు హోదాను ఇస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపైనా చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News