: ‘స్లేట్ స్కేల్’తో లెక్కప్రకారం తినొచ్చు!
మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, కొవ్వు, క్యాలరీలు మొదలైన వివరాల గురించి తెలియజెప్పేందుకు కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన ఎలక్ట్రానిక్ వస్తువు స్లేట్ స్కేల్. చిన్న పలకలాగా ఉండే స్లేట్ స్కేల్ ను ముందుగా మన ఫోన్ కి అనుసంధానం చేసుకోవాలి. మనం తీసుకోదలచిన ఆహార వస్తువులను ఆ పలకపై ఉంచితే పోషక విలువలకు సంబంధించిన సమాచారం మన ఫోన్ కి అందుతుంది. కొవ్వు, ప్రొటీన్లు, ఇతర వివరాలన్నింటిని లెక్కకడుతుంది. స్లేట్ స్కేల్ పై ఒక కిలో వరకు వస్తువులను ఉంచవచ్చు. ఐ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ పరికరాన్ని అనుసంధానం చేసుకునే సౌకర్యం ఉంది. దీని ధర విషయానికొస్తే సుమారు రూ.3000 కు పైమాటే.