: చైనా యూనివర్శిటీలో అమ్మాయిలు, అబ్బాయిలపై వింత నిబంధన!
ఈ యూనివర్శిటీ దారే వేరు. ఇక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరినొకరు తాకడానికి వీల్లేదు. వాళ్ల మధ్య దూరం మెయింటెన్ చేయాల్సిందే. చైనాలోని చంగ్షా నగరంలో ఉన్న ఈ యూనవర్శిటీ పేరు జిలిన్ కనస్ట్రక్షన్. ఇక్కడ చదువుకునే విద్యార్థినీ విద్యార్థులు ప్రవర్తనా నియమావళిని తప్పకుండా పాటించాల్సిందే. ఈ మేరకు తాజాగా ఒక నిబంధనల జాబితాను విడుదల చేసింది. ముఖ్యంగా ప్రేమ జంటలు ఒకరినొకరు తాకకుండా కట్టుబాట్లు పెట్టింది. ఈ నిబంధనలపై యూనివర్శిటీ అధికారులు మాట్లాడుతూ, విద్యార్థుల ప్రవర్తన బాగుండాలి, వారి ప్రవర్తన అనాగరికంగా ఉండకూడదు, అందుకే ఈ నిబంధనలు పెట్టామని పేర్కొన్నారు. కాగా, యూనివర్శిటీ నిబంధనలపై విద్యార్థులు పెదవి విరుస్తున్నారు.