: రైనాకు షాక్...రహానేకు ప్రమోషన్


టీమిండియా సీనియర్ ఆటగాడు సురేశ్ రైనాకు బీసీసీఐ షాకిచ్చింది. అదే సమయంలో ధోనీకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న రహానేకు ప్రమోషన్ ఇచ్చి సత్కరించింది. సౌతాఫ్రికా సిరీస్ లో ఫాం కోల్పోయి తంటాలు పడుతున్న సురేశ్ రైనాను 'ఏ' గ్రేడ్ కాంట్రాక్టు నుంచి బీసీసీఐ తొలగించింది. అతని స్థానంలో 'బీ' గ్రేడ్ కాంట్రాక్టులో ఉన్న అజింక్య రహానేకు ప్రమోషన్ ఇచ్చి ఏ గ్రేడును కట్టబెట్టారు. ఏ గ్రేడ్ ఆటగాడిగా రహానేకు బీసీసీఐ ఏడాదికి కోటి రూపాయల వేతనం ఇవ్వనుంది. కాగా, ఏ గ్రేడు కాంట్రాక్టులో కేవలం నలుగురు ఆటగాళ్లకు మాత్రమే బీసీసీఐ చోటు కల్పించడం విశేషం. ఈ నలుగురిలో టీట్వంటీ, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమిండియా స్పిన్ తురుపుముక్క రవిచంద్రన్ అశ్విన్, సఫారీలతో సిరీస్ లో ఆకట్టుకున్న అజింక్యా రహానేలకు మాత్రమే చోటు కల్పించడం విశేషం. గతంలో ఈ జాబితాలో ధావన్, రోహిత్ శర్మ, రైనా, భువనేశ్వర్ కుమార్ వంటి ఆటగాళ్లు చోటు సంపాదించుకున్నారు. నిలకడ లోపంతో వారంతా జాబితాలో చోటు కోల్పోయారు.

  • Loading...

More Telugu News