: మేమిలాగే పలకరించుకుంటాం: కరాటే టోర్నీలో అక్షయ్ కుమార్


బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు మార్షల్ ఆర్ట్స్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. బాలీవుడ్ లో అడుగు పెట్టిన నాటి నుంచి నేటి వరకు మార్షల్ ఆర్ట్స్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు, ఓ మార్సల్ ఆర్ట్స్ అకాడమీని కూడా నడిపిస్తున్నారు. ఈ అకాడమీ ఈ మధ్యే ముంబైలో మహిళలకు శిక్షణ శిబిరం నిర్వహించింది. ఆత్మరక్షణలో మెళుకువలు నేర్పింది. తాజాగా ఈ అకాడమీ ఓ టోర్నీ నిర్వహించింది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ తన విద్యార్థులను ఎలా పలకరిస్తాడో స్టేజ్ పై చేసి చూపి అందర్నీ ఆకట్టుకున్నాడు. చేతుల ఆధారంతో తల్లకిందులుగా నిలబడి ఒకచేతితో అభివాదం చేశాడు. తాము ఇలాగే పలకరించుకుంటామని పేర్కొంటూ ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వర్థమాన నటుడు టైగర్ ష్రాఫ్ చేసిన లైవ్ ఫీట్లు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ వీడియోలకు వీరి అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది.

  • Loading...

More Telugu News