: బీజేపీ ఓటమికి వాళ్లిద్దరే కారణం: మాజీ సీఎం మాంఝీ


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పరాజయం విషయంలో మాజీ ముఖ్యమంత్రి, హిందూస్థాన్ అవామీ మోర్చా(హెచ్ఏఎం) అధినేత మాంఝీ ఇద్దరిని నిందించారు. బీజేపీ ఓటమికి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలే కారణమంటూ ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా వారిద్దరూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యల కారణంగానే ఎన్డీయేకు దెబ్బతగిలిందని, వీటిని ప్రచారాస్త్రాలుగా ప్రతిపక్షాలు మలచుకున్నాయని మాంఝీ పేర్కొన్నారు. కాగా, ‘దళితులు, ఓబీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్ కోటాపై సమీక్ష జరపాలి’ అని మోహన్ భగవత్, ‘బీహార్ లో బీజేపీ ఓడిపోతే పాకిస్థాన్ లో టపాకాయలు పేలుతాయి’ అని అమిత్ షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రెండు అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసిన మాంఝీ ఒక్కస్థానంలో మాత్రమే విజయం సాధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News