: శత్రుఘ్న సిన్హాపై చర్యలకు ఉమా భారతి డిమాండ్


బీజేపీకి శత్రుఘ్న సిన్హా విలువ ఇప్పుడు తెలిసినట్టుంది. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కకుండా చేసిన బీజేపీ అధిష్ఠానం, ఫలితాల్లో బొక్కబోర్లా పడడంతో జరిగిన నష్టం తెలిసి వచ్చినట్టు కనబడుతోంది. ఓటమిపై విశ్లేషణలు చేసుకుంటున్న బీజేపీకి బీహార్ లో ఛరిష్మా ఉన్న శత్రుఘ్న సిన్హా చేసిన వ్యాఖ్యలు గుర్తుకొచ్చాయి. సిన్హాపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ఉమా భారతి డిమాండ్ చేశారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధిష్ఠానానికి సూచించారు. కాగా, మహాకూటమి విజయానంతరం నితీశ్ ను కలిసిన సిన్హా తామిద్దరం మిత్రులమని, అందుకే నితీశ్ ను కలిశానని చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News