: భారతీయ సంస్కృతికి అద్దంపట్టిన విదేశీ కళాకారులు
ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ సమీపంలో స్పానిష్ కళాకారులు ఇచ్చిన ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. కేరళ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా కథాకళి నృత్యరూపకాన్ని ఈ విదేశీ కళాకారుల బృందం ప్రదర్శించింది. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ నృత్యరూపకాన్ని ప్రదర్శించిన కళాకారులను అక్కడున్న వారు అభినందనలతో ముంచెత్తారు. ఈ నృత్యరూపకం సందేశాత్మకంగా ఉందంటూ పలువురు ప్రశంసించారు. ఇండియన్ పాప్ స్టార్ సునీతా రావ్, గాయకుడు రాధాకృష్ణన్ పాడిన పాటలు ప్రేక్షకులను ఆనందింపజేశాయి.