: వరంగల్ ఉపఎన్నిక కొందరి స్వార్థం వల్ల వచ్చింది: ఎమ్మెల్యే రోజా


వరంగల్ ఉప ఎన్నిక ప్రజలు కోరుకున్నది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. కొందరి స్వార్థం వల్లే ఈ ఎన్నిక వచ్చిందని చెప్పారు. వరంగల్ లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తరపున ఆమె ఇవాళ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా రఘునాథపల్లె, స్టేషన్ ఘనపూర్, జాఫర్ గడ్, వర్ధన్నపేటలలో నిర్వహించిన రోడ్ షోలలో పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. మాటల మాంత్రికుడు, ఏపీ సీఎం చంద్రబాబు నోటు ఉంటే ఓటు వస్తుందని భావిస్తున్నారని ఆమె విమర్శించారు. రాజధాని పేరుతో దోచుకున్న డబ్బుతో వరంగల్ లో ఓట్లు కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలను పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధివచ్చేలా వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని రోజా ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచారంలో రోజాతో పాటు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News