: అందాల'బొమ్మ'ను మనువాడిన యువకుడు!


ఓ అందమైన భార్య, ముచ్చటైన పిల్లలు, హ్యాపీగా సాగిపోయే సంసారం...తన సొంతం కావాలని ప్రతి యువకుడు కలలు కంటాడు. చైనాకు చెందిన ఓ 28 ఏళ్ల యువకుడు కూడా అలాగే కలగన్నాడు. ఇంతలో ఊహించని విధంగా ఈ యువకుడికి టెర్మినల్ కేన్సర్ సోకింది. ఇక ఎంతో కాలం బతకడని వైద్యులు తేల్చారు. ఎలాగూ బతకనని గుర్తించిన యువకుడు వివాహం చేసుకోవాలని భావించాడు. అయితే తన వివాహం వల్ల ఓ యువతి జీవితం నాశనం కాకూడదని భావించి, మంచి ముహూర్తం నిర్ణయించాడు. ముహూర్తం దగ్గరపడ్డాక సెక్స్ డాల్ ను తెచ్చుకున్నాడు. దానిని మేకప్ మేన్ లతో అందంగా పెళ్లి కూతురిగా ముస్తాబు చేయించాడు. బంధుమిత్రులందరినీ పిలిచి సంప్రదాయబద్ధంగా ఆ బొమ్మను వివాహమాడాడు. అనంతరం పెళ్లి కూతురుతో కలసి రకరకాల భంగిమలలో ఫోటోలు దిగాడు. ఇప్పుడు ఈ ఫోటోలు చైనా సోషల్ మీడియా వైబోలో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. అయితే పెళ్లి కొడుకు వ్యక్తిగత భద్రత దృష్ట్యా అతని పేరు వెల్లడించడం లేదని సదరు వెబ్ సైట్ పేర్కొంది.

  • Loading...

More Telugu News