: ఎయిర్ పోర్టులో గన్ కలకలం.. స్వాధీనం చేసుకున్న పోలీసులు
హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో కొద్దిసేపటి క్రితం కలకలం చోటుచేసుకుంది. కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఎయిర్ పోర్టులోకి, ముంబై వెళ్లేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ గన్ ను తమ బ్యాగుల్లో పెట్టుకుని ఎంటరయ్యారు. అనుమానం వచ్చిన పోలీసులు వారి బ్యాగేజీని తనిఖీ చేయగా గన్ బయటపడింది. దానిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.