: ఓఆర్ఓపీ విషయంలో అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు: రక్షణ మంత్రి పారికర్
ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ (ఓఆర్ఓపీ-వన్ ర్యాంక్, వన్ పెన్షన్) నోటిఫికేషన్ విషయంలో సైనికోద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. ప్రధాన అంశాలన్నింటినీ నోటిఫికేషన్లో చేర్చామన్నారు. పథకం అమల్లో తలెత్తే సమస్యల పరిష్కారానికి జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇంకా ఏవైనా సమస్యలుంటే కమిషన్ పరిష్కరిస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో డిమాండ్ చేసే హక్కు అందరికీ ఉందన్న పారికర్, ప్రధాన డిమాండ్లను నెరవేర్చామని చెప్పారు. అయితే ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదని అన్నారు.