: 32 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ విషయంలో పొరపడ్డాం... తిరిగి ఇప్పుడు!: క్షమాపణ చెప్పిన ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్
బీహారులో తుది దశ పోలింగ్ ముగిసిన అనంతరం, 90 శాతం టీవీ చానళ్లు, సర్వే సంస్థలు భీకర పోరు మధ్య నితీష్ కు కాస్తంత మొగ్గు కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ఒక రోజు ఆలస్యంగా ఎన్డీటీవీ మాత్రం గెలుపు బీజేపీదేనని, 150కి పైగా సీట్లు వస్తాయని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ రిపోర్టును దేశవ్యాప్తంగా అన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాలు ప్రముఖంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ఆపై 24 గంటల తరువాత సీన్ రివర్సైంది. ఎన్డీటీవీ అంచనాలు గతి తప్పాయి. దీనిపై చానల్ సహ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్ క్షమాపణలు చెప్పారు. 32 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు క్లీన్ స్వీప్ చేస్తున్నారని ముందుగా ఊహించలేకపోయామని, ఆపై తిరిగి ఇప్పుడు మాత్రమే తమ అంచనాలు అంతే ఘోరంగా విఫలమయ్యాయని ఆయన తెలిపారు. ప్రజల్లో, ఎన్డీటీవీ ప్రేక్షకుల్లో తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయోమయాన్ని పెంచాయని ఆయన అంగీకరించారు. కొన్నిసార్లు సాంకేతిక కారణాలతో ఇటువంటి తప్పులు జరుగుతాయని, మరోసారి ఇటువంటి పెద్ద తప్పులు జరుగకుండా చూసుకుంటామని తెలిపారు.