: చోటా రాజన్ పై సీబీఐ డీల్ చేసే మొదటి కేసు ఇదే!


ఇటీవల భారత్ కు తీసుకువచ్చిన అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ పై వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో పదుల సంఖ్యలో కేసులుండగా, సీబీఐ మాత్రం తొలుత ఆయన దగ్గరున్న దొంగ పాస్ పోర్టు కేసుపై పడింది. ఈ కేసులో రాజన్ ను గట్టిగా ఇరికించగలిగితే, జైల్లో ఉంచి మిగతా కేసులను నిదానంగా, లోతుగా విచారించవచ్చన్నది సీబీఐ అధికారుల భావనగా తెలుస్తోంది. జి 9273860 నంబరు పేరిట 2008లో మోహన్ కుమార్ అనే పేరు మీద రాజన్ పాస్ పోర్టు తీసుకున్నాడు. తాను మాండ్యాలో పుట్టినట్టు చూపుతూ, అక్కడి ఓ చిరునామా కూడా ఇచ్చాడు. మాండ్యాలోని పోలీసులు సహకరించడం వల్లే అక్కడి నుంచి రాజన్ వెరిఫికేషన్ వంటివి సులువుగా ముగించుకుని పాస్ పోర్టు పొందాడని అనుమానిస్తున్న సీబీఐ, ఇప్పుడు 2008లో పశ్చిమ మాండ్యలో పనిచేసిన పోలీసులను విచారించేందుకు సిద్ధమైంది. రాజన్ పై తొలుత డీల్ చేసే కేసు ఇదేనని సమాచారం.

  • Loading...

More Telugu News