: గెలిచిన తర్వాత... నితీశ్ చేసిన మొదటి ఫోన్ కాల్ బీజేపీ కురువృద్ధుడికే!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నితీశ్ కు నిన్న పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడి కాకముందే అభినందనలు వెల్లువెత్తాయి. అయితే విజయం వరించిన తర్వాత నితీశ్ ఈ విషయాన్ని అందరికంటే ముందుగా బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీకి ఫోన్ చేసి చెప్పారట. తనకు పోటీగా దిగిన పార్టీ నేతకు నితీశ్ ఫోన్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచేదే. అయితే ఇందులో ఆశ్చర్యపడాల్సిన అంశం ఏమీ లేదని నితీశ్ వర్గం చెబుతోంది. నిన్న అద్వానీ 89వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఫోన్ చేసిన నితీశ్ పనిలో పనిగా తనకు దక్కిన విజయాన్ని బీజేపీ సీనియర్ నేతకు చెప్పారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నితీశ్ కు అద్వానీ కూడా అభినందనలు తెలిపారు.