: శ్రీనిపై వేటు పడేనా?... నేడే బీసీసీఐ కీలక భేటీ


ప్రపంచ క్రికెట్ లో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ భవితవ్యం నేడు తేలిపోనుంది. ఐపీఎల్ లో తన కంపెనీ ఇండియా సిమెంట్స్ ఆధ్వర్యంలోని జట్టు చెన్నై సూపర్ కింగ్స్, స్పాట్ ఫిక్సింగ్ లో అల్లుడు గురునాథ్ మెయెప్పన్ పాత్రలతో అప్పటిదాకా ఓ వెలుగు వెలిగిన శ్రీని ప్రాభవం క్రమంగా కొడిగట్టింది. ఇప్పటికే బీసీసీఐ పీఠం నుంచి ఆయన దిగిపోవాల్సి వచ్చింది. అయితే క్రికెట్ పై ఉన్న మక్కువతో ఛీత్కారాలు ఎదురవుతున్నా, ఆయన ఐసీసీ చైర్మన్ పదవిలో ఇంకా కొనసాగుతున్నారు. బీసీసీఐ ప్రతినిధిగా సదరు పోస్టులో కొనసాగుతున్న ఆయనను సాగనంపేందుకు బీసీసీఐ కొత్త బాస్ శశాంక్ మనోహర్ గుట్టుచప్పుడు కాకుండా పావులు కదుపుతున్నట్లు సమాచారం. నేడు ముంబైలో బీసీసీఐ ఏజీఎం సమావేశమవుతోంది. ఈ సమావేశంలో శ్రీని తమ ప్రతినిధి కాదని ఐసీసీకి తేల్చిచెప్పే దిశగా బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే బీసీసీఐ లేఖ అందగానే శ్రీని ఐసీసీ చైర్మన్ పదవి నుంచి దిగిపోక తప్పదు. ఈ నేపథ్యంలో నేటి బీసీసీఐ ఏజీఎంపై క్రీడా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News