: ‘నోటా’కు పెరుగుతున్న ఓట్లు... బీహార్ లో ‘నోటా’కు ఓటేసిన 9 లక్షల మంది ఓటర్లు
ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ మీకు నచ్చలేదు. ఏం చేయాలి? ఓటింగ్ కు దూరంగా ఉండాలా? అవసరం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ‘నోటా’ పేరిట ఓ బటన్ ను ఏర్పాటు చేసింది. బరిలో నిలిచిన ఏ ఒక్క అభ్యర్థి కూడా మీకు ఇష్టం లేకపోతే, సదరు బటన్ ను నొక్కేయొచ్చు. ప్రస్తుతం ఈ బటన్ ను నొక్కుతున్న ఓటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న ముగిసిన బీహార్ బరిలో ఈ బటన్ ను ఏకంగా 9,13,561 లక్షల మంది ఓటర్లు నొక్కారు. మొత్తం పోలైన ఓట్లలో ఈ బటన్ నొక్కిన వారి శాతం 2.5 శాతంగా తేలింది.