: ఒంటరి పోరుకు దిగి ... ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేకపోయిన పార్టీ!


మహాకూటమితో తెగతెంపులు చేసుకుని బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఒంటరిగా దిగిన సమాజ్ వాది పార్టీ (ఎస్పీ) ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయమై తలెత్తిన విభేదాలతో మహా కూటమి నుంచి వైదొలగుతున్నట్లు ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నాడు ప్రకటించిన విషయం తెలిసిందే. మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీని చేర్చుకోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీంతో మహాకూటమి నుంచి బయటకు వచ్చి, ఒంటరిగా బీహార్ ఎన్నికల బరిలో దిగారు. కానీ, కనీసం ఒక్క స్థానంలో కూడా ఎస్పీ విజయం సాధించలేకపోయింది. మహాకూటమిలో ఎస్పీ కొనసాగినట్లయితే మూడో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు మరింత ప్రాధాన్యం లభించేదని రాజకీయ పండితుల విశ్లేషణ. కాగా, బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన నితీశ్-లాలూలకు ములాయం, అఖిలేష్ యాదవ్ లు అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News