: 13 జిల్లాల్లో ఖాతా తెరవని ‘కమలం’
బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కొన్ని జిల్లాల్లో భారతీయ జనతాపార్టీ తన ఖాతాను కూడా తెరవలేకపోయింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలువలేకపోయింది. బక్సార్, బెగుసరాయ్, కిషన్ గంజ్, మాదేపురా, ముంగేర్, సమస్తీపూర్, షేక్ పురా, అరావల్, భోజ్ పూర్, శివోర్, జెహనాబాద్, ఖగాడియా, సహర్ష జిల్లాల్లో ‘కమలం’కు ఒక్క సీటు కూడా దక్కకపోవడం గమనార్హం. కాగా, మహాకూటమి దూసుకుపోతుండగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే చతికిలపడింది. ఎన్నికల ఫలితాలు తమకు గుణపాఠం చెప్పాయని, చేసిన పొరపాట్లు, జరిగిన పొరపాట్ల గురించి ఆలోచిస్తామంటూ బీజేపీ నేత ప్రకాశ్ జవదేవకర్ చేసిన ప్రకటన విదితమే.