: ఎన్నికల ఫలితాలు మాకు గుణపాఠం: ప్రకాశ్ జవదేకర్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమకు మంచి గుణపాఠం చెప్పాయని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ అన్నారు. పొరపాట్ల గురించి పార్టీలో చర్చిస్తామని అన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రధాని మోదీ ఇమేజ్ కు ఎదురుదెబ్బ కాదని బీజేపీ మరో నేత రాంమాధవ్ అన్నారు. బీహార్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని రాంమాధవ్ పేర్కొన్నారు. ఈరోజు ఉదయం బీజేపీ అధిక్యంలో కొనసాగుతున్నట్లు అనిపించినా, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయని ఆయన పేర్కొన్నారు.