: సోనియాజీ థ్యాంక్యూ... మోదీజీ మీకు కూడా!: నితీశ్ ట్వీట్స్
బీహార్ ఎన్నికల్లో విజయదుందుభి మోగించనున్న జేడీయూ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముచ్చటగా మూడోసారి సీఎం పీఠాన్ని కైవసం చేసుకోనున్నారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే నితీశ్ విజయం ఖరారైపోయింది. కాంగ్రెస్, ఆర్జేడీలతో జట్టుకట్టి మహా కూటమి పేరిట బరిలోకి దిగిన నితీశ్ కుమార్ స్పష్టమైన మెజారిటీ దిశగా సాగుతున్నారు. ఈ క్రమంలో విజయం సాధించబోతున్న నితీశ్ కు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫోన్ చేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తనకు సోనియా, మోదీ ఫోన్ చేసిన విషయాన్ని నితీశ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అంతేకాక తనకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, సోనియా గాంధీలకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.