: మేం బీహారీలను నమ్మాం... మమ్మల్ని వారు విశ్వసించారు: మాజీ సీఎం రబ్రీదేవీ


బీహార్ ఎన్నిల్లో మహా కూటమి విజయంపై ఆ కూటమిలోని ప్రధాన పార్టీ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, ఆ రాష్ట్ర మాజీ సీఎం రబ్రీదేవి స్పందించారు. నేటి ఉదయం మొదలైన కౌంటింగ్ లో కడపటి వార్తలు అందే సమయానికి మహా కూటమి 17 స్థానాల్లో విజయం సాధించి మరో 147 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది. ఇక ఓ స్థానంలో విజయం సాధించిన బీజేపీ మరో 69 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో మహా కూటమి విజయం దాదాపుగా ఖరారైంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన రబ్రీదేవి ప్రజల తీర్పుపై హర్షం ప్రకటించారు. బీహార్ ప్రజలను తాము నమ్మామని, తమను ప్రజలు విశ్వసించారని ఆమె వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News