: సహనం గెలిచింది... అసహనం ఓడింది: నితీశ్ విజయంపై దీదీ కామెంట్
బీహార్ లో మహా కూటమి విజయంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేగంగా స్పందించారు. ఇంకా పూర్తి స్థాయి ఫలితాలు వెలువడకముందే మహా కూటమి విజయం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం దీదీ మీడియాతో మాట్లాడారు. బీహార్ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే సహనం విజయం సాధించగా, అసహనం ఓటమి పాలైందని ఆమె వ్యాఖ్యానించారు. ఉమ్మడిగా విజయం సాధించిన నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లకే కాక మహా కూటమికి విజయం కట్టబెట్టిన బీహార్ ప్రజలకు దీదీ శుభాకాంక్షలు తెలిపారు.