: నితీశ్ కు అభినందనల వెల్లువ... చారిత్రాత్మక విజయం సాధించారన్న కేజ్రీ
బీహార్ ఎన్నికల్లో ఊహించని వేగంతో దూసుకెళుతున్న మహా కూటమి రథ సారథి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే నితీశ్ విజయంపై స్పందించిన శివసేన నితీశ్ కుమార్ ను పొలిటికల్ హీరోగా అభివర్ణించింది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మహా కూటమి విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ‘చారిత్రాత్మక విజయం సాధించిన నితీశ్ కుమార్ కు నా అభినందనలు’ అని కేజ్రీవాల్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన సీఎంలు, ఆయా పార్టీల నేతల నుంచి కూడా నితీశ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.