: పొలిటికల్ హీరోగా నితీశ్ ఆవిర్భవించారు... ఓటమికి మోదీదే బాధ్యత: శివసేన సంచలన ప్రకటన


బీజేపీ మిత్రపక్షం శివసేన కొద్దిసేపటి క్రితం సంచలన ప్రకటన చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో నితీశ్ కుమార్ పై ప్రశంసలు కురిపిస్తూ ఆ పార్టీ ప్రకటన చేసింది. నితీశ్ గొప్ప విజయాన్ని సాధించారని, ఈ విజయంతో నితీశ్ పొలిటికల్ హీరోగా ఆవిర్భవించారని శివసేన ప్రకటించింది. బీజేపీకి మిత్రపక్షంగానే ఉన్నప్పటికీ బీహార్ ఎన్నికల్లో శివసేన ఒంటరిగానే బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేటి ఉదయం మొదలైన కౌంటింగ్ లో మహా కూటమి అభ్యర్థులు గెలుపు దిశగా దూసుకెళుతున్నారు. బీజేపీ కూటమి కంటే రెట్టింపు సంఖ్య సీట్లలో మహా కూటమి అభ్యర్థులు ఆధిక్యం సాధించారు. ఇక మిత్రపక్షం బీజేపీపై కూడా శివసేన ఘాటు వ్యాఖ్యలు చేసింది. బీజేపీ ఓటమికి మోదీనే బాధ్యత వహించాలని కూడా ఆ పార్టీ తేల్చిచెప్పింది.

  • Loading...

More Telugu News