: ‘బహార్ వాలా’దే పైచేయి... ప్రారంభంలో ఆధిక్యం సాధించిన బీజేపీ


దేశ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న బీహార్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. కౌంటింగ్ లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఆదిలో ఆధిక్యం కనబరచింది. తొలి రౌండ్ ముగిసిన 44 స్థానాల్లో 31 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా సాగుతున్నారు. ఇక ఆ రాష్ట్ర అధికార పార్టీ జేడీయూ నేతృత్వంలోని మహా కూటమి 12 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. ఓ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ఆధిక్యం సాధించారు. ఇక బీహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీ మగ్ధంపూర్ నియోజకవర్గంలో విజయం దిశగా పయనిస్తున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ కూడా రాఘవ్ పూర్ నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News