: ఎవరి ధీమా వారిదే!... బీహార్ లో ఓట్ల లెక్కింపు ప్రారంభం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తుది అంకానికి తెర లేచింది. రాష్ట్రవ్యాప్తంగా 39 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ప్రారంభమైన ఓట్ల లెక్కింపునకు పోలీసులు భారీ భద్రతను కల్పించారు. మరో అరగంటలో తొలి రౌండ్ ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల బరిలోకి దిగిన 3,450 మంది అభ్యర్థుల భవితవ్యం మరికాసేపట్లో తేలిపోనుంది. ఇదిలా ఉంటే, హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో విజయంపై మహా కూటమితో పాటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కూడా ధీమాగానే ఉన్నాయి. నేటి మధ్యాహ్నంలోగా పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నాయి.