: సుజనా చౌదరి సంచలన వ్యాఖ్య... మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకమని ప్రకటన


టీడీపీ సీనియర్ నేత, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లకు తాను వ్యతిరేకమని ఆయన చేసిన ప్రకటనపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయవాడలో నిన్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్ (సీవోడబ్ల్యూఈ)ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మహిళా రిజర్వేషన్లకు వ్యక్తిగతంగా తాను వ్యతిరేకమని ప్రకటించారు. ‘‘ఉమెన్ కి రిజర్వేషన్ అక్కర్లేదు. అన్ని రంగాల్లోనూ వారు ముందున్నారు. వారికి అలా స్టాంప్ వేసి కూర్చోబెట్టడం తప్పనేది నా అభిప్రాయం. 360 డిగ్రీస్ లో పూర్తి స్థాయిలో మేనేజ్ మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇంటర్నెట్, వాట్సప్ సాయంతో మహిళలు అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చూపించుకుంటున్నారు. చుట్టుపక్కల వారి అవసరాలను గుర్తించి దానికి అనుగుణంగా పరిశ్రమలు నడిపితే ట్రాన్స్ పోర్టేషన్ ఖర్చు ఉండదు’’ అని మంత్రి సుదీర్ఘ ప్రసంగం చేశారు. మహిళా రిజర్వేషన్లకు తమ పార్టీ అనుకూలమేనని, తాను వ్యక్తిగతంగా మాత్రమే దీనిని వ్యతిరేకిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News