: బీహార్ పీఠం బీహారీవాలాదే!...‘ఆంధ్ర ఆక్టోపస్’ సర్వేలో మహాకూటమిదే విజయం


బీహార్ బరిలో బీహారీవాలా (నితీశ్ కుమార్) గెలుస్తారా? లేక ‘బహార్ వాలా’ (నరేంద్ర మోదీ) విజయం సాధిస్తారా? అన్న అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వెలువడిన పలు ఎగ్జిట్ పోల్స్ లోనూ మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కొన్ని సర్వేలు బీజేపీ గెలుస్తుందని పేర్కొనగా, మరికొన్ని సర్వేలు మాత్రం మహా కూటమికి పట్టం కట్టాయి. అయితే ఎవరు గెలిచినా, మెజారిటీ మాత్రం స్వల్పమేనని అన్ని సర్వేలు తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలో ‘ఆంధ్ర ఆక్టోపస్’గా పేరుపడ్డ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా సర్వే చేయించారు. లగడపాటి సర్వేలో బీహారీవాలా నితీశ్ కుమార్ నే విజయం వరిస్తుందని తేలింది. ఎన్డీఏ కూటమి కన్నా 10 నుంచి 15 సీట్లు అధికంగా మహా కూటమి గెలుచుకుంటుందని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోమారు సీఎం సీట్లో కూర్చుంటారని ఆ సర్వే తేల్చిచెబుతోంది. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రం, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలపై వాస్తవ ఫలితాలకు కాస్త అటుఇటుగా సర్వే ఫలితాలను వెల్లడించిన లగడపాటి సర్వే బీహార్ ఎన్నికల్లో ఏమాత్రం నిజమవుతుందో చూడాలి.

  • Loading...

More Telugu News