: 'లోఫర్' ఫస్ట్ లుక్ పై రాంగోపాల్ వర్మ కామెంట్!
ప్రముఖ నటుడు రాంగోపాల్ వర్మలో స్పందనలు ఎక్కువన్న సంగతి తెలిసిందే. దేవుడి దగ్గర్నుంచి సమాజంలో ఉన్న చాలా అంశాలపై రాంగోపాల్ వర్మ చాలా స్పష్టంగా తన భావాలు వ్యక్తం చేస్తాడు. తాజాగా వర్మ నేటి సాయంత్రం పూరీ జగన్నాథ్ విడుదల చేసిన 'లోఫర్' ఫస్ట్ లుక్ పై స్పందించాడు. సూపర్ ఎమోషనల్ ఫస్ట్ లుక్ అని పేర్కొన్నాడు. రేవతి లాంటి సీనియర్ నటిని పూరీ సినిమాలో చూడడం ఆనందంగా ఉందని అన్నాడు. పోస్టర్ లో వరుణ్ వెనుక ఉన్న త్రిశూలానికి, వరుణ్ చూపిన ఎక్స్ ప్రెషన్ కి అద్భుతమైన లింక్ ఉందని అన్నాడు. మరో పోస్టర్ లో హీరో, హీరోయిన్ల రొమాంటిక్ మూడ్ పై మణిరత్మం-పూరీ జగన్నాథ్ క్రాస్ బ్రీడ్ లా ఉందని పేర్కొన్నాడు. దీనికి పూరీ జగన్నాథ్ 'థ్యాంక్యూ సర్' అంటూ ట్వీట్ చేశాడు. కాగా, తొలి రెండు సినిమాల్లో గుడ్ బాయ్ లా కనిపించిన వరుణ్ తేజ్ సరికొత్త లుక్ లో ఆకట్టుకుంటున్నాడని అంతా పేర్కొంటున్నారు.