: ఎల్బీ నగర్లో ఇద్దర్ని చితక్కొట్టిన నైజీరియన్లు...అనంతరం వారిని చావబాదిన స్థానికులు
హైదరాబాదులోని ఎల్బీనగర్ లో నైజీరియన్లు హల్ చల్ చేశారు. నేటి సాయంత్రం రోడ్డు మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆరుగురు నైజీరియన్లు చితక్కొట్టారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ఆరుగురు నైజీరియన్లను పట్టుకుని చావబాదారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసి, అప్పగించారు. దీంతో వీరిని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు, ఆరాతీయగా వారు సెయింట్ మేరీస్ కళాశాలలో చదువుతున్నట్టు గుర్తించారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. కాగా, మూడు నెలల క్రితం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో కూడా నైజీరియన్లు స్థానికులపై దాడి చేసిన సంగతి తెలిసిందే.