: పురుషులకు దీటుగా బాంబు నిర్వీర్య బృందంలో మహిళలు


కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు విభాగాల్లో మహిళా ఉద్యోగుల ప్రాధాన్యత మరింత పెరుగుతోంది. పురుషులకు దీటుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే త్రివిధ దళాల్లో ఒకటైన వాయుసేనలో యుద్ధవిమానాల పైలెట్లుగా మహిళలను నియమించనున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు సరిహద్దు ప్రాంతంలోనూ మహిళా సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా పురుషులతో సమానంగా బాంబు నిర్వీర్యం చేయడంలోనూ మహిళా అధికారులు శిక్షణ పొందుతున్నారు. త్వరలోనే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహించేలా వారు సంసిద్ధులవుతున్నారు.

  • Loading...

More Telugu News