: మీరిచ్చే తీర్పుతో ప్రతిపక్షాల చెంప ఛెళ్లుమనాలి: హరీష్ రావు


వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ గెలుపు ఖాయమైపోయిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ ఎన్నికల్లో ఓటు వేయమని అడిగే హక్కు ప్రతిపక్షాలకు లేదని చెప్పారు. విపక్షాల చెంప ఛెళ్లుమనేలా ఓటర్లు తీర్పునివ్వాలని కోరారు. ఈ రోజు స్టేషన్ ఘన్ పూర్ లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హరీష్ రావుతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తెలంగాణ గ్రామాలను ఏపీలో కలిపినందుకు టీడీపీకి ఓటు వేయాలా? లేక టీడీపీకి మద్దతు పలికిన బీజేపీకి ఓటు వేయాలా? అనే విషయాన్ని ప్రజలు తేల్చుకోవాలని చెప్పారు.

  • Loading...

More Telugu News