: సోము వీర్రాజు ఏకలింగం: ఎమ్మెల్యే బొండా ఉమ


మిత్రపక్షం టీడీపీపై రోజుకో విమర్శ చేస్తూ ఈ మధ్య కాలంలో పతాక శీర్షికలకు ఎక్కిన బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారని... కానీ, వీర్రాజు మాత్రం చంద్రబాబును అప్రతిష్ట పాలుచేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏకలింగంలా వీర్రాజు ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. మిత్ర ధర్మం కోసం తాము కట్టుబడితే, కొందరు బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజు వెనుక ఎవరున్నారో తమకు తెలుసని అన్నారు. బీజేపీ నేతలు తమ ప్రవర్తన మార్చుకోకపోతే వారి అధిష్ఠానానికి చెబుతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News