: గెలుపుదిశగా టీమిండియా
బ్యాట్స్ మెన్ బెంబేలెత్తిపోతున్న మొహాలీ టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకుపోతోంది. 218 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా టీమిండియా స్పిన్నర్ల ధాటికి విలవిల్లాడుతోంది. 60 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 86 పరుగులు. వాన్ జిల్ 26 పరుగులతో, హార్మర్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోవైపు ఎల్గర్ 16, ఫిలాండర్ 1, డుప్లెసిస్ 1, ఆమ్లా 0, డివిలియర్స్ 16, విలస్ 7 లు పెవిలియన్ చేరారు. జడేజా 3, అశ్విన్, మిశ్రా, ఆరోన్ లు చెరో వికెట్ తీశారు. సౌత్ ఆఫ్రికా గెలవాలంటే మరో 132 పరుగులు చేయాలి. టీమిండియా గెలవాలంటే టెయిలెండర్లను పెవిలియన్ పంపితే చాలు.