: అవినీతిలో మనకన్నా చైనీయులే ఘనులు: ఆసక్తి కలిగిస్తున్న సరికొత్త నివేదిక


ఓ రైల్లో బెర్తు కావాలన్నా, ఎమ్మార్వో ఆఫీసు నుంచి సర్టిఫికెట్ కావాలన్నా... రిజిస్ట్రేషన్ ఆఫీసులోనైనా, సినిమా హాల్ వద్దైనా... ప్రజలే అవినీతిని పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తే ఇండియా కన్నా, చైనాలోనే లంచగొండితనం అధికంగా ఉందట. కరప్షన్ విషయంలో చైనాతో పోలిస్తే భారత ర్యాంకు మెరుగ్గా ఉందని ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ తాజాగా విడుదల చేసిన అధ్యయనం ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది. మొత్తం 175 దేశాలను భాగస్వామ్యం చేస్తూ, సర్వే నిర్వహించి, అతి తక్కువగా అవినీతి ఉన్న దేశాల నుంచి మొదలు పెట్టి ర్యాంకులివ్వగా, ఇండియా 85వ స్థానంలో, చైనా 100వ స్థానంలో నిలిచాయి. అవినీతి రహిత దేశాలను ఎంపిక చేసి పాయింట్లు ఇవ్వగా, నూటికి 38 పాయింట్లను ఇండియా పొందిందని, చైనాకు 36 పాయింట్లు వచ్చాయని తెలిపింది. సున్నా పాయింట్లు వస్తే, అత్యధిక అవినీతి ఉందని, 100 పాయింట్లు వస్తే నిజాయతీ నిండిన దేశమని భావించగా, ఏ దేశానికి కూడా 100 పాయింట్లు రాలేదని ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. కాగా, ఈ జాబితాలో 92 పాయింట్లతో డెన్మార్క్, 91 పాయింట్లతో న్యూజిలాండ్, 89 పాయింట్లతో ఫిన్ లాండ్, 87 పాయింట్లతో స్వీడన్, 86 పాయింట్లతో నార్వే తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి.

  • Loading...

More Telugu News