: ఇక మంగళవాయిద్యాల కాలం... నేటి నుంచి వివాహ సీజన్ మొదలు
వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు వచ్చేశాయి. గత మూడు నాలుగు నెలలుగా పుష్కరాలు, కత్తెర తదితరాలతో వివాహాల సందడికి దూరంగా ఉన్న కల్యాణ మండపాలకు కొత్త కళ సంతరించుకుంది. నవంబర్ డిసెంబర్ నెలల్లోని శుభ ముహూర్తాల్లో వేలాది జంటలు ఒకటి కానున్నాయి. జనవరి 11 నుంచి ఫిబ్రవరి 9 వరకూ మళ్లీ మంచి రోజులుండవని పురోహితులు చెబుతున్నారు. నవంబరు 7, 13, 14, 15, 17, 18, 19, 20, 22, 26 తేదీలతో పాటు డిసెంబరులో 2, 4, 5, 6, 14, 16,17, 20, 21, 24, 25, 27, 30, 31 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని వివరించారు. అన్ని ప్రధాన నగరాల్లోని కల్యాణ మండపాల నుంచి బాజా భజంత్రీలు, వంట సామానులు అద్దెకిచ్చే టెంట్ హౌస్ లు, డెకరేషన్, ఫోటో, వీడియో గ్రాఫర్ల బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది.