: థ్యాంక్ గాడ్, నేను సచిన్ టీమ్ లోనే ఉన్నా!: షోయబ్ అఖ్తర్


క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కు జీవితకాల ప్రత్యర్థిగా ఉన్న ప్రఖ్యాత మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అఖ్తర్ ఎంతో ఆనందంగా ఉన్నాడు. అమెరికాలో జరగనున్న 'క్రికెట్ ఆల్ స్టార్స్' సిరీస్ లో సచిన్ జట్టులో అతను ఉండటమే షోయబ్ ఆనందానికి కారణం. "గత 15 ఏళ్లుగా సచిన్ తో పోటీపడ్డా. నిజాయతీగా చెప్పాలంటే సచిన్ కు ఇక ఎంత మాత్రం బౌలింగ్ చేయలేను. ఈ సిరీస్ లో సచిన్ కోసం నేను, నా కోసం సచిన్ ఒకే జట్టులో ఆడుతాం. సచిన్ తో కలసి ఆడబోతుండటం ఎంతో గొప్ప అనుభూతిని కలిగిస్తోంది. సచిన్ జట్టులోనే ఉండాలని ముందు నుంచి అనుకున్నా. అదే జరిగింది. థ్యాంక్ గాడ్" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సచిన్ ఒక విధ్వంసకర బ్యాట్స్ మెన్ అని, చరిత్రలో అతనికన్నా గొప్ప ఆటగాడు లేడని షోయబ్ ఆకాశానికి ఎత్తేశాడు. సచిన్ కు తాను బౌలింగ్ చేయడాన్ని అభిమానులు కోరుకుంటారని... అయితే, ఇప్పటికే ఆ పని చేసేశానని, ఇక చేయలేనని చెప్పాడు.

  • Loading...

More Telugu News