: అధికారులు వేధిస్తున్నారని చేతులు నరుక్కున్న ఆర్టీసీ డ్రైవర్


తనను ఉన్నతాధికారులు నిత్యమూ వేధింపులకు గురి చేసి ఏడిపిస్తున్నారని ఆరోపిస్తూ, ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ తన చేతులను నరుక్కున్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కలకలం రేపింది. ఆర్టీసీలో చాలాకాలంగా డ్రైవరుగా పనిచేస్తున్న ప్రతాప్, తనను జగ్గయ్యపేట రీజనల్ మేనేజర్ నాయక్ నిత్యమూ తిడుతూ వేధిస్తున్నాడని ఆరోపించారు. వచ్చే అంతంతమాత్రం జీతం నుంచి తన ఇంటికి నిత్యావసరాలు తేవాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడని తెలిపారు. తేకుంటే, విధుల్లో అలసత్వం చూపుతున్నాడని రిమార్కులు రాస్తున్నాడని వాపోయాడు. ఇతని వేధింపులు తాళలేకే ఈ పని చేస్తున్నానని పెద్దగా అరుస్తూ, ఈ ఉదయం డిపో ఎదుట ఓ కత్తితో తన చేతులు నరుక్కున్నాడు. ఆ వెంటనే స్పందించిన ఇతర డ్రైవర్లు ప్రతాప్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రతాప్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇకపై అతను బస్సు నడపలేడని వైద్యులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News