: కడియంపై చెప్పు విసరడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం: పొన్నాల
వరంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై ఓ రైతు చెప్పు విసిరిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ, చెప్పు విసిరిన ఘటన టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. 16 నెలలకే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత వస్తుందనుకోలేదని ఆయన అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వానికి మరింత వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. ఇక సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమయ్యారని పొన్నాల ఎద్దేవా చేశారు.