: సామర్లకోటలో దోపిడీ దొంగల ఘాతుకం... డబ్బుల కోసం ఓ వ్యక్తి నాలుక కోశారు!
తూర్పుగోదావరి జిల్లా సామమర్లకోటలో ఓ వ్యక్తిపై దోపిడీ దొంగలు ఘాతుకానికి పాల్పడ్డారు. బలుసుపేట వాసి అయిన నాగసాయి(42) వెల్డింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఈ ఉదయం ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుని అతను వెళుతుండగా కొంతమంది దుండగులు అడ్డుకున్నారు. బెదిరించి అతని వద్దనున్న డబ్బులు లాక్కున్నాక అతని నాలుక కోసి పరారయ్యారు. ఇది చూసిన స్థానికులు వెంటనే అతన్ని కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ అతను మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.