: సిరిసిల్ల రాజయ్య జైలుకెళ్లడం ఇది మూడోసారి


కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల అనుమానాస్పద మృతి కేసులో నిందితుడిగా వరంగల్ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య జైలుకు వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన ఉద్యోగం చేస్తున్న సమయంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టై 2006 డిసెంబర్ 8న తొలిసారిగా జైల్లో కాలుమోపారు. ఆ తరువాత తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న వేళ, రైల్ రోకోలో పాల్గొని 2013లో మరోసారి జైలుకెళ్లారు. తిరిగి ఇప్పుడు మూడోసారి ఆయన జైలుకెళ్లారు. అప్పట్లో వెంటనే జైలు నుంచి తిరిగి వచ్చిన ఆయన, ఈ దఫా బయటకు రావడం అంత సులువు కాకపోవచ్చు.

  • Loading...

More Telugu News